గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. శుక్రవారం జిల్లాలో కొత్తగా 920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 45వేల 975 పాజిటివ్ కేసులు నమోదు కాగా... కరోనా నుంచి కోలుకుని 35వేల752మంది ఇంటికి చేరుకున్నారు. గుంటూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొవిడ్ వైరస్ ప్రభావంతో ఏడుగురు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 453కి చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 161 కేసులు నమోదయ్యాయి.
మండల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. తెనాలి-69, మంగళగిరి-57, నరసరావుపేట-55, సత్తెనపల్లి-40, చెరుకుపల్లి-40, తుళ్లూరు-38, రొంపిచర్ల-30, రెంటచింతల-28, పొన్నూరు-27, ఈపూరు-25, తాడేపల్లి-22, బాపట్ల-21, తాడికొండ-19, ముప్పాళ్ల-18, ఫిరంగిపురం-18, అమృతలూరు-17, నగరం-16, పెదనందిపాడు-16, మాచర్ల-16, అచ్చంపేట-16, అమరావతి-15, ప్రత్తిపాడు-14, పెదకాకాని-13, కారంపూడి-10, చిలకలూరిపేట-10, నూజండ్ల-10, నకరికల్లు-10 చొప్పున కేసులు నమోదయ్యాయి.