- CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్
పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు.
- Employee unions On PRC: ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని.. సీఎంను కోరాం: ఉద్యోగ సంఘాలు
ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరినట్లు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగ వ్యవస్థ మొత్తానికి ఒకే జీవో ఇవ్వాలని ఇవాళ జరిగిన సమావేశంలో సీఎం జగన్‌ను కోరామన్నారు.
- Chandrababu Kuppam Toru: కుప్పం పర్యటన అందుకే : చంద్రబాబు
మూడు రోజుల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. పార్టీ శ్రేణులు అధినేతకు ఘనస్వాగతం పలికాయి. చిత్తూరు జిల్లా దేవరాజుపురంలో నిర్వహించిన రోడ్ షోలో బాబు పాల్గొన్నారు.
- Lokesh Letter To Jagan : పోలవరం నిర్వాసితుల దీక్షలు విరమింపజేయండి -లోకేశ్
పోలవరం నిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరిపి, వాళ్ల సమస్యలు పరిష్కరించి.. దీక్షలు విరమింపజేయాలని తెదేపా నేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు.
- ఆ విమానంలో భారత్‌కు వచ్చిన 125 మందికి కరోనా
ఇటలీ నుంచి పంజాబ్‌కు వచ్చిన ఛార్టెర్డ్ విమాన ప్రయాణికుల్లో 125 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో మొత్తం 179 మంది భారత్‌కు వచ్చారన్నారు.
- ఉబర్ క్యాబ్‌లో 9 గంటలు నరకం.. చివరకు రూ.45వేలు బిల్!
అమెరికా వర్జీనియాలో మంచు కారణంగా ఏర్పడ్డ భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయిన ఓ ఉబర్ ప్రయాణికుడు.. రూ.45 వేల(600 డాలర్లు) బిల్లు చెల్లించాల్సి వచ్చింది.
- నాలుగు వరుస సెషన్ల లాభాలకు బ్రేక్- సెన్సెక్స్ 621 మైనస్
స్టాక్ మార్కెట్లపై మళ్లీ బేర్ పంజా విసిరింది. సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా పతనమై.. 60 వేల మార్కును కోల్పోయింది. నిఫ్టీ 170 పాయింట్లకుపైగా క్షీణించింది. ఐటీ, రియల్టీ షేర్లు డీలాపడ్డాయి.
- రిలయన్స్ రికార్డ్.. 400 కోట్ల డాలర్ల విదేశీ కరెన్సీ బాండ్లు జారీ
రిలయన్స్ సంస్థ మరో ఘనత సాధించింది. విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా 400 కోట్ల డాలర్లు సమీకరించిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సాధించింది. 30, 40 ఏళ్ల కాల వ్యవధితో ఈ బాండ్లు జారీ చేసింది.
- IND vs SA 2nd Test: వర్షం ఆటంకం- నాలుగో రోజు ఆట జరిగేనా?
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వర్షం కొనసాగుతుండటం వల్ల కాస్త ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
- 'సర్కారు వారి పాట' క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పండగే!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎస్ తమన్. ఈ సినిమా మ్యూజిక్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే దానిని ప్రేక్షకులకు వినిపించడం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.