ప్రభుత్వం ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించడాన్ని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. ఇతర రాష్ట్రాలు, పార్లమెంట్‌కు లేని కొవిడ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వానికే వర్తిస్తున్నాయా? అంటూ ప్రశ్నించారు. ఒక్కరోజు అసెంబ్లీ నిర్వహణతో ఒరిగేదేమీ లేదన్న యనమల.. 14 ఆర్డినెన్స్ ప్రవేశపెట్టి ఎలాంటి చర్చా లేకుండా ఆమోదించుకోవడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగమని నిలదీశారు. బాధ్యతల నుంచి పారిపోయేలా జగన్ రెడ్డి విధానాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. స్వయంకృతాపరాధాన్ని కొవిడ్ మీదకు నెట్టి సీఎం తప్పించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజానీకం ఇబ్బంది పడుతోందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు కూడా దొరకని విధంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: AP governor: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత