- రాష్ట్రంలో కొత్తగా 18,285 కరోనా కేసులు, 99 మరణాలు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్‌ను పరీక్షించగా, 18,285 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కేజీహెచ్‌లో వైద్యుడిపై దాడి ఘటన..ఎనిమిది మంది అరెస్టు
విశాఖ కేజీహెచ్‌లో వైద్యుడిపై దాడి ఘటనలో కేసు నమోదైంది. ఈ దాడిలో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- జూన్ 1 నుంచి.. తిరుమల - అలిపిరి నడక మార్గం మూసివేత!
తిరుమల - అలిపిరి నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని తితిదే తితిదే అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సీలేరు జలాశయంలో పడవ ప్రమాదంపై గవర్నర్ విచారం
సీలేరు జలాశయంలో జరిగిన పడవ ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అధికారులు.. నిన్న ఆరు మృతదేహాలను వెలికితీశారు. ఇవాళ మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సీఎం మార్పు తప్పదా- పగ్గాలు ఎవరి చేతికి?
కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారా? ఏమో ప్రస్తుత పరిణామాలు చూస్తే కాదని చెప్పలేం. నాయకత్వ మార్పు ఉండబోదని హైకమాండ్ స్పష్టం చేస్తున్నా.. సీఎం యడియూరప్పను తొలగిస్తారన్న వదంతులు రాష్ట్రంలో విచ్చలవిడిగా వ్యాపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పురిటి నొప్పులు ఆగవు.. దారేమో కనిపించదు!
ఆ తల్లి పురిటి నొప్పుల బాధను చూసి అడవి నిశ్శబ్దంగా రోధించింది. అభివృద్ధి చెందుతున్న సమాజానికి మహిళ పెడుతున్న అరుపులు వినిపించట్లేదా అని హీనంగా వెక్కిరించింది. ఆ అతివ పడుతున్న యాతన చూడలేక.. తన పచ్చని ఒడిలోనే పండంటి బిడ్డకు ప్రసవం పోసింది. ఇదేదో.. బీసీ కాలపు నాటి కథ కాదండీ.. కేరళలోని పతనంతిట్ట జిల్లా చలకాయమ్ అటవీ ప్రాంతంలో ఇప్పుడు జరిగిన వాస్తవ ఘటన. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆక్సిమీటర్' యాప్ వాడుతున్నారా? జర భద్రం!
స్మార్ట్ ఫోన్లలో ఆక్సిజన్ టెస్టింగ్ యాప్‌ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ యాప్‌ల ద్వారా వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా: 53 దేశాలకు పాకిన బీ.1.617 రకం వైరస్
బీ.1.617 రకం కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో గుర్తించిన ఈ వైరస్ ఇప్పుడు 53 దేశాలకు పాకిందని వెల్లడించింది. ఈ కొత్తరకం వైరస్ బారిన పడినవారిలో తీవ్రత ఏవిధంగా ఉంటుందనేదానిపై పరిశీలన జరుగుతోందని సంస్థ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఐపీఎల్ రీషెడ్యూల్కు ఆసీస్ ప్లేయర్లు దూరం!
ఐపీఎల్ రీషెడ్యూల్ మ్యాచ్‌లకు ఆసీస్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మూడో వారంలో మిగతా మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు విండీస్ పర్యటనకు వెళ్లనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భార్య ఆత్మహత్య కేసులో ప్రముఖ నటుడు అరెస్టు
మలయాళ నటుడు ఉన్నీ దేవ్‌ను కేరళలోని నేదుమంగాడ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తన భార్య ప్రియాంక ఆత్మహత్య కేసులో భాగంగా విచారణ కోసం ఉన్నీ దేవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి