- ప్రభుత్వ జాప్యం.. అధికారుల అలసత్వం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తనను తిరిగి నియమించాలని ఇచ్చిన కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- అది 'జగన్ రెడ్డి ఇళ్ల స్థలాల అమ్మకం పథకం'
పేదల స్థలాలు బలవంతంగా లాక్కొని తిరిగి పేదలకు అమ్మడమే 'జగన్ రెడ్డి ఇళ్ల స్థలాల అమ్మకం పథకం' అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- అన్యాయం తప్ప అభివృద్దే లేదు
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నివారణ చర్యలకు ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేయాలని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని మండిపడ్డారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- తల ఓ చోట.. మొండెం మరో చోట..
కడప జిల్లా యర్రగుంట్లలో ఇండియా సిమెంట్ లిమిటెడ్ విశ్రాంత ఉద్యోగి వెంకటరమణయ్య దారుణహత్యకు గురయ్యారు. నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆయన... ఇవాళ శవమై కనిపించారు. ఎర్రగుంట్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్య ఇంట్లో వెంకట రమణయ్య మృతదేహం లభ్యమైంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో విస్తరించిన సహకార బ్యాంకులు సహా అన్ని రకాల సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. డిపాజిటర్ల మేలు కోసమే ఈ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'కరోనా వినాశక విఘ్నేశుడు సిద్ధం!'
కర్ణాటకలో ఓ యువకుడు వినూత్నంగా వినాయకుని విగ్రహాన్ని రూపొందిస్తున్నాడు. ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిని నాశనం చేసే సందేశంతో 'కరోనా సంహారి' గణేశ్ ప్రతిమను తయారు చేస్తున్నాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- వరుస లాభాలకు బ్రేక్
లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 561 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 166 పాయింట్లు క్షీణించింది. ఆర్థిక షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కదం తొక్కిన భారత బలగాలు
రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా గెలుపును గుర్తు చేసుకుంటూ నిర్వహించిన 75వ విక్టరీ డే పరేడ్లో భారత బలగాలు అబ్బురపరిచే ప్రదర్శన చేశాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'సీబీఐ దర్యాప్తు జరిపించాలి'
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని నటీనటులు శేఖర్ సుమన్, రుపా గంగూలీ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఆసియాకప్ జరుగుతుంది.. కానీ!
షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ జరుగుతుందని పాక్ బోర్డు సీఈఓ వసీమ్ ఖాన్ చెప్పారు. శ్రీలంకలో లేదంటే యూఏఈలో నిర్వహిస్తామని అన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి