రాష్ట్రంలోని పలు జిల్లాలో రాగల నాలుగు, ఐదు గంటల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని....అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ సూచించారు.
ఇదీ చదవండి: ఉరుములు, మెరుపులతో వర్షాలు... రైతుల ఆందోళన