Tension in the Tinmar Mallanna program: తెలంగాణలో తీన్మార్ మల్లన్న బృందం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. మల్లన్న బృందం కార్యక్రమం ప్రారంభించిన అనంతరం.. అభివృద్ధి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు తెరాస నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మల్లన్న బృందం, తెరాస వర్గం మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఒకానొక సందర్భంలో పోలీసులు లాఠీలకు పని చెప్పి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ గొడవలో గాయపడ్డ తీన్మార్ మల్లన్న బృంద సభ్యుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. గొడవపై సమాచారం అందుకున్న మల్లన్న కార్యక్రమానికి రాకుండానే వెనుదిరిగారు.
ఇవీ చదవండి: