Merging Problems: అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం హెచ్.చెర్లోపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతుల విద్యార్థులను విలీనం చేశారు. జడ్పీ పాఠశాలలో అప్పటికే 98మంది విద్యార్థులు ఉండగా.. విలీనంతో మరో 34 మంది పిల్లలు వచ్చారు. గదులు సరిపడా లేకపోవడంతో వరండాలోనే బోధన, మంచినీరు, తరగతి గదుల్లో విద్యుత్తు లేక పడుతున్న ఇబ్బందులను ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన కలెక్టరు గిరీష.. 3,4,5 తరగతుల విద్యార్థులను తిరిగి ప్రాథమిక పాఠశాలకు తరలించాలని డీఈవో రాఘవరెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఉన్నత పాఠశాల నుంచి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులను తరలించారు. ఇకపై అక్కడే వారంతా విద్యను అభ్యసించనున్నారు.
* ‘ఈనాడు’ కథనానికి ఏలూరు జిల్లా డీఈవో గంగాభవాని స్పందించారు. ఉంగుటూరు మండలం బాదంపూడి ఉన్నత పాఠశాలలో బెంచీల కొరత ఉండటంతో 3, 4, 5 విద్యార్థులు నేలపైనే కూర్చొంటున్నారు. సోమవారం డీఈవో పాఠశాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న వెల్లమిల్లి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి బెంచీలు, డెస్కులు తెప్పించారు. అనంతరం మండలంలోని రాచూరు ఉన్నత పాఠశాలకు వచ్చి గదుల కొరతపై ఆరా తీశారు. రెండో విడత నాడు-నేడు పనుల్లో అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని ఎంఈవో పి.హనుమకు సూచించారు.
ఇవీ చదవండి: