రాజధానిలో జరుగుతున్న ఆందోళనలపై స్పందించేందుకు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నిరాకరించారు. గుంటూరులో జరిగిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి అంటూ ఉన్న ప్లకార్డు ఉండటంతో దాన్ని ఆమెతో ఉన్నవారు తీసేప్రయత్నం చేశారు. శ్రీదేవి కూడా ఓ చేయి వేసి ప్లకార్డును పక్కకు నెట్టేశారు. అనంతరం రాజధానిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఆందోళన చేస్తున్నారని... దాని గురించి స్పందించమని మీడియా ప్రతినిధులు ఆమెను కోరారు. వాటి గురించి ఇప్పుడు అడగొద్దంటూ ఎమ్మెల్యే శ్రీదేవి సమాధానం ఇచ్చారు.
వైకాపా ఎమ్మెల్యే ముందు... ఏపీని రక్షించండి అంటూ ప్లకార్డు..! - తాడికొండ ఎమ్మెల్యే వార్తలు
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఓ కార్యక్రమానికి హాజరవ్వగా... అక్కడ ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి అంటూ ఉన్న ప్లకార్డు దర్శమమిచ్చింది. ఆమె ఓ చేయి వేసి ప్లకార్డును పక్కకు నెట్టేశారు.