ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తే అంగీకరించేది లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైనతే కోర్టుకు వెళతామని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణలపై ఎన్ని సార్లు తనిఖీ చేసినా ఎక్కడా అక్రమాలు ఉండవని తేల్చి చెప్పారు.
మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో 2426 స్థానాల్లో వైకాపా మద్దతుదారులు గెలిచారని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడో దశలో తెదేపా మద్దతుదారులు 527 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారని తెలిపారు. వైకాపా మద్దతుతో గెలిచిన అభ్యర్థుల ఫొటోలు వివరాలన్నింటినీ వెబ్సైట్లో పొందుపరిచామని... ఎవరైనా తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు.
ఇదీ చదవండి: