ETV Bharat / city

Chit Fund Fraud in Guntur: చిట్టీల పేరుతో రూ.20 కోట్లు వసూలు చేసి..

author img

By

Published : Dec 8, 2021, 3:38 PM IST

Updated : Dec 8, 2021, 4:13 PM IST

Chit Fund Fraud in Guntur
Chit Fund Fraud in Guntur

15:32 December 08

మంగళగిరి మండలం ఆత్మకూరులో చిట్టీల పేరుతో మోసం

Chit Fund Fraud in Guntur: గుంటూరు జిల్లా మంగళగిరిలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వ్యాపారి వెంకటేశ్వరరావు 20ఏళ్లకు పైగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు. ఇవాళ ఉదయం ఇంటికి తాళం వేసి ఉండటంతో అందరూ అనుమానించారు. ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు. అప్రమత్తమైన బాధితులు విచారించగా ఇళ్లతో పాటు ఇతర ఆస్తులను అమ్మేసినట్లు తేలింది. కుటుంబంతో సహా వెంకటేశ్వరరావు పారిపోయారని గుర్తించిన బాధితులు లబోదిబోమంటున్నారు. 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. చిట్టీల సమయం ముగిసినా వాటిని ఇవ్వలేదని.. వడ్డీ ఇస్తానని చెప్పి నమ్మించాడని వాపోయారు. అంతా ప్రణాళిక ప్రకారమే మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. తమ కష్టార్జితాన్ని కొల్లగొట్టిన వెంకటేశ్వరరావును పట్టుకోవాలని బాధితులు.. మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దారి దోపిడీ.. ఒకటి కాదు
highway robbery gang at Guntur: గుంటూరు జిల్లా య‌డ్ల‌పాడు మండ‌లం ప‌రిధిలో దారి దోపిడీ దొంగలు రెచ్చియారు. బైక్ పై వెళ్తున్న వారిపై దాడిచేసి నగదు లాక్కెళ్లారు. లింగారావుపాలెం సమీపంలో ద్విచ‌క్ర‌వాహ‌నాలపై వెళ్తున్న దంప‌తుల‌ నుంచి బంగారు న‌గ‌లు, న‌గ‌దు దోచుకెళ్లిన ఘ‌ట‌న సోమ‌వారం రాత్రి జ‌రిగింది. బాధితులు మంగ‌ళ‌వారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దోపిడీకి సంబంధించిన వివరాలను యడ్లపాడు ఎస్సై రాంబాబు వెల్లడించారు.

లింగారావుపాలెం ఎస్సీ కాల‌నీకి చెందిన వీర‌య్య‌, ప్ర‌స‌న్న దంప‌తులు. గుంటూరు వెళ్లి సోమ‌వారం రాత్రి 9:30 గంట‌ల స‌మ‌యంలో ఇంటికి వెళ్తున్నారు. బోయ‌పాలెం నుంచి లింగారావుపాలెం మార్గంలోని చెరువు వ‌ద్ద‌కు రాగానే గుర్తుతెలియ‌ని యువ‌కులు వారిపై క‌ర్ర‌ల‌తో దాడి చేసి ప‌క్క‌నే ఉన్న పొలంలోకి వారిని లాక్కెళ్లారు. వీర‌య్య‌ను కొట్టి గాయ‌ప‌రిచారు. ప్ర‌స‌న్న చెవుల‌కు ఉన్న 3.5గ్రాముల బంగారు ఆభ‌ర‌ణాలు, రూ.2,300ల న‌గ‌దు, సెల్‌ఫోన్ లాక్కుని పంపించారు.

కొద్దిసేపట్లోనే...
Roadside Robbery in Guntur మ‌రికొద్దిసేప‌టికి అదే మార్గంలో అంక‌మ్మ‌, న‌ర‌స‌మ్మ దంప‌తుల‌పైనా దాడి చేసి చెవి క‌మ్మ‌లు, జూకాలు సెల్‌ఫోన్ లాక్కున్నారు. గొలుసు లాగే క్ర‌మంలో స‌గం తెగి అంక‌మ్మ జాకెట్‌లో ప‌డింది. ఆ త‌ర్వాత వారు ప్రాధేయ‌ప‌డ‌టంతో వ‌దిలేశారు. స‌మాచారం తెలుసుకున్న కాల‌నీవాసులు.. పెద్ద ఎత్తున ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఈ లోపే దుండ‌గులు ప‌రార‌య్యారు. క్ష‌త‌గాత్రులు చిల‌క‌లూరిపేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడు వీర‌య్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్ రప్పించి త‌నిఖీలు నిర్వ‌హించారు. ఫింగ‌ర్‌ప్రింట్స్ తీసుకొని ల్యాబ్​కు పంపినట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి

సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్- ఐదుగురు మృతి

Last Updated : Dec 8, 2021, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.