Roads: రాష్ట్ర సరిహద్దులో ఉన్న ‘ఆంధ్ర-జైపూర్’ రహదారి మన రోడ్ల దుస్థితిని ఎగతాళి చేస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే.. ఒడిశాలోని ఈ మార్గం నల్లటి తారుతో, తెల్లటి గీతలతో మెరిసిపోతుంటే.. మన రాష్ట్రంలోకి వచ్చే సరికి దారా.. ఏరా అన్నట్లు నీటితో నిండిన భారీ గుంతలతో ఉంది. మన రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆసుపత్రికి చేరుకోవాలన్నా నరకప్రాయంగా మారింది.
ఆంధ్ర- జైపూర్ మార్గంలో.. హుకుంపేట మండల కేంద్రం నుంచి కామయ్యపేట గ్రామం వరకు 20కి.మీ. ఉంటే.. అందులో 10కి.మీ. గోతుల మయమైంది. స్థానిక గిరిజనులు నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించడం లేదు. ప్రస్తుత వర్షాలకు దారి చెరువులా మారింది.
ఇవీ చూడండి: