సమాచార హక్కు అమలు చట్టం ప్రధాన కమిషనర్, కమిషనర్ల ఎంపికకు సంబంధించి ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ ఇవాళ సమావేశమైంది. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశానికి కమిటీ ఛైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి జగన్, ఎంపిక కమిటీలో నామినేటెడ్ సభ్యుడు, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సమావేశానికి హాజరు కాలేదు.
ఇదీ చదవండి: జులై 8న ఉచిత ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ: సీఎం జగన్