ETV Bharat / city

రాజధానికి 60 ఎకరాలిచ్చిన మల్లెల శ్రీనాథ్ చౌదరి మృతి - రాజధాని నిర్మాణానికి 60 ఎకరాలు ఇచ్చిన రాయపూడి మాజీ సర్పంచ్ మల్లెల శ్రీనాథ్ చౌదరి అనారోగ్యంతో మృతి

అమరావతిలో రాజధాని నిర్మాణానికి 60 ఎకరాలు ఇచ్చిన.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి మాజీ సర్పంచ్ మల్లెల శ్రీనాథ్ చౌదరి మరణించారు. అనారోగ్యం కారణంగా చనిపోగా.. రాజధాని గ్రామాల ప్రజలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

mallela srinath chowdary
మల్లెల శ్రీనాథ్ చౌదరి మృతి
author img

By

Published : Dec 20, 2020, 7:03 AM IST

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి మాజీ సర్పంచ్ మల్లెల శ్రీనాథ్ చౌదరి.. శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ఆయన 60 ఎకరాలు ఇచ్చారు. పేదలపై మమకారంతో వారి బాధల్లో పాలుపంచుకుంటూ.. అందరి అభిమానాన్ని చూరగొన్నారు.

తాడికొండ సమితి అధ్యక్షుడుగా, రాయపూడి పంచాయతీ సర్పంచ్​గా.. 20 సంవత్సరాలు శ్రీనాథ్ చౌదరి సేవలందించారు. 2004లో అమరావతిలోని శ్రీ శ్రీ రామకృష్ణ హిందూ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్​గా విశేష సేవలు అందించి.. ప్రజల మన్ననలు పొందారు. ఆయన మృతి తమకు తీరని లోటని.. రాజధాని గ్రామ ప్రజలు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. మైనర్ ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.