హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు(private hostel owner Suicide at Hyderabad). నారాయణ అనే వ్యక్తి వినాయక నగర్‌లో పీజీ హాస్టల్‌ను నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. కొవిడ్ తగ్గుముఖం పట్టినప్పటికీ.. హాస్టల్ సరిగా నడవడం లేదు. దానికి తోడు భవన యజమాని భూపాల్ రెడ్డి ఇంటి అద్దె కట్టాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఇంట్లో వస్తువులను, వంట సామానులను రోడ్డు మీద వేస్తామని బెదిరించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన నారాయణ సుసైడ్ నోట్ రాసి.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు(private hostel owner narayana Suicide at Hyderabad).
నారాయణ మృతికి కారణం భవన యజమానేనని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంటనే భూపాల్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని హాస్టల్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: