ETV Bharat / city

తెలంగాణలో నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి - telangana varthalu

తెలంగాణలో గ్రామసీమలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతూ.. ప్రణాళికాభివృద్ధే ధ్యేయంగా చెేపట్టిన పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పనులు, ఫలితాలను సమీక్షించుకొని తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసి అవసరమైన పనులు చేపడతారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, మార్కెట్ల లాంటి వాటి పూర్తికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఏడో విడత హరితహారాన్ని కూడా ఇందులో భాగంగానే చేపట్టనున్నారు. ఈ దఫాలో మరో 20 కోట్ల మొక్కలను లక్ష్యంగా నిర్ధేశించుకున్న తెలంగాణ సర్కార్... రహదారి వనాలు, బృహత్ ప్రకృతి వనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి నాటి, సంరక్షించేలా ప్రజలను ప్రోత్సహించనున్నారు.

telangana state palle-pragathi-and-pattana-pragathi-programme
తెలంగాణలో నేటినుంచి పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు
author img

By

Published : Jul 1, 2021, 9:08 AM IST

తెలంగాణలో మరో విడత పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులను సమీక్షిస్తారు. ఇందుకోసం తెలంగాణలోని అన్ని గ్రామాలు, పట్టణాల వారీగా పల్లెప్రగతి, పట్టణప్రగతి నివేదికలు తయారు చేశారు. ఆయా గ్రామాలు, పట్టణాలకు వచ్చిన నిధులు, చేసిన ఖర్చు, చేపట్టిన పనులు, ప్రస్తుతం వాటి స్థితి, అవసరాలు, తదితరాలను ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది.

తొలి రోజు కార్యక్రమాలు

తొలిరోజైన ఇవాళ గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి. సభ వేదికగా నివేదికలోని అంశాలను వెల్లడించి, సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ, పదిరోజుల కోసం చేపట్టాల్సిన పనులపై అందరి సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, హరితహారం, విద్యుత్ అంశాలు ప్రధాన ఎజెండాగా పదిరోజుల ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చేయాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.

పరిశుభ్రతకు ప్రాధాన్యం

రహదార్లు, ప్రజోపయోగ స్థలాలను శుభ్రంగా ఉంచడంతో పాటు రోడ్లపై గుంతలు ఫూడ్చివేయాలి. పాడుబడిన భవనాలు, శిథిలాలను తొలగించాలి. ఖాళీ స్థలాలకు సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. వాటిని కూడా శుభ్రం చేసి అందుకు అయిన ఖర్చు, జరిమానా, పాలనా వ్యయాన్ని యజమానుల నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది. పాతబావులను పూడ్చివేయాలి. మురుగుకాల్వలు శుభ్రం చేయాలి.

నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మురుగునీటిని తొలగించాలి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఫాగింగ్, రసాయనాల పిచికారీ, ఆయిల్ బాల్స్ వేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి, మంచినీటి వనరులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలి. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల పనులన్నింటినీ పూర్తి చేసి వాటన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

పవర్​ డేను నిర్వహించాలి...

తెలంగాణలోని అన్ని వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల చుట్టూ పెద్దపెద్ద మొక్కలతో గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. పట్టణప్రాంతాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలి. మరణించిన వారిని తరలించేందుకు అన్ని పట్టణాల్లో కనీసం ఒక వైకుంఠ రథాన్ని సమకూర్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె, పట్టణప్రగతిలో భాగంగా ఒకరోజు పవర్ డే నిర్వహించి విద్యుత్ సంబంధిత సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకోవాలని. వంగిన, తుప్పుపట్టిన, కూలిపోయిన స్తంభాలను తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేయాలి. వీధిదీపాలన్నింటినీ ఎల్ఈడీ బల్బులు అమర్చాలి.

ఏడో విడత హరితహారం

పల్లె, పట్టణప్రగతిలో భాగంగానే ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ దఫాలో 20 కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పల్లెలు, పట్టణాల్లో ఉన్న అన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అన్ని రకాల రహదార్ల వెంట పెద్దఎత్తున మొక్కలు నాటి రహదారి వనాలను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట రెండు, మూడు వరుసల్లో మొక్కలు నాటాల్సి ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి చోటా యాదాద్రి నమూనాలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలి. గతంలో నాటిన మొక్కల్లో ఎక్కడైనా చనిపోయి ఉంటే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలి. పాఠశాలలు, సంస్థలు, కార్యాలయాలు తదితర ప్రజోపయోగ సంస్థల ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటాలి, లేఅవుట్ల ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటి సంరక్షించాలి.

ఇంటికి ఆరు మొక్కలు

ఇప్పటికే చేపట్టిన ప్రకృతి వనాల పనులు పూర్తి చేయాలి. పట్టణాల్లో, మండల కేంద్రాల్లో ఐదు నుంచి పదెకరాల విస్తీర్ణంలో బృహత్ ప్రకృతివనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి వాటిని ఆ కుటుంబం వారు నాటి, సంరక్షించేలా ప్రోత్సహించాలి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట సమీపంలో అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించనున్న తెలంగాణ మంత్రులు కేటీ రామారావు. ఇంద్రకరణ్ రెడ్డి... ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఆకస్మిక తనిఖీలు

పల్లె, పట్టణప్రగతి కోసం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధికారులు రాత్రి పూట గ్రామాల్లో బస చేయాలని ఆదేశించింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలి. క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ప్రగతి పురోగతిపై అధికారులు ప్రతిరోజూ నివేదికలు పంపాల్సి ఉంటుంది.

మంత్రులు మొదలుకొని వార్డు సభ్యుల వరకు ప్రతిఒక్కరినీ కార్యక్రమంలో భాగస్వామ్యుల్ని చేయాలి. ప్రజలను చైతన్యపరిచి పల్లె, పట్టణప్రగతి విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికారుల ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, అలక్ష్యంగా ఉండే వారిపై చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.

నిధుల సమస్య లేకుండా..

కార్యక్రమాల అమలు కోసం నిధుల పరంగా ఎలాంటి సమస్య లేకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. 750 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసింది. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు రెగ్యులర్​గా ఇచ్చే నిధులకు తోడు మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు అదనపు నిధులు ఇచ్చింది. అత్యసరంగా పనుల మంజూరు కోసం మంత్రులకు రెండు కోట్లు, కలెక్టర్లకు కోటి, అదనపు కలెక్టర్లకు 30 లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది.

ఇదీ చదవండి:

POLAVARAM: పోలవరం నిర్వాసితులకు అదనపు ఆర్థిక సాయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.