ETV Bharat / city

'ఒక్క రోజులోనే మాటెలా మారింది?' - నారా లోకేశ్ తాజా వార్తలు

ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని పట్టుకోవడం చేతగాక... సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన తమ పార్టీ సానుభూతిపరులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నిందితులుగా చూపించడం దుర్మార్గమని తెదేపా నేతలు మండిపడ్డారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : Jan 15, 2021, 11:05 PM IST

Updated : Jan 16, 2021, 6:40 AM IST

‘హిందుత్వం మనుగడను ప్రశ్నించేలా దాడులు జరుగుతుంటే నిందితులను పట్టుకోలేక అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న డీజీపీపైౖ కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘నిన్ననే కదా విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్లు, దొంగలు, జంతువుల పని అన్నారు. ఒక్క రోజులోనే రాజకీయ కుట్ర కోణం వైపు మీమాటెందుకు మారింది. మీరు విడుదల చేసిన జాబితాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం పోన్నకల్లులో ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చిన వైకాపా నేత దామోదర్‌రెడ్డి, ఓంకారక్షేత్రంలో అర్చకులపై దాడి చేసిన వైకాపా నేత ప్రతాప్‌రెడ్డి, ఆంజనేయస్వామికి చేయి విరిగితే రక్తమొస్తుందా?
అన్న మంత్రి నాని పేర్లు ఎందుకు లేదు? అని ప్రశ్నించారు.

వైకాపా అధికార ప్రతినిధిగా సరిపోతారు: అచ్చెన్నాయుడు

‘సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని నిందితులుగా చిత్రీకరిస్తారా? నిన్నలేని రాజకీయ కుట్ర కోణం నేడెలా వచ్చింది? మీరు డీజీపీగా కంటే వైకాపా అధికార ప్రతినిధిగా సరిపోతారు’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ట్వీట్‌ చేశారు.

అందుకే మిమ్మల్ని వైపీఎస్‌ అనేది: అయ్యన్నపాత్రుడు

‘దాడి వెనక రాజకీయం లేదన్న ఒక్క రోజులోనే మాట ఎందుకు మారింది? అందుకే మిమ్మల్ని ఐపీఎస్‌ కాదు...వైపీఎస్‌ అనేది. కర్నూలు జిల్లాలో విగ్రహాల ధ్వంసం, పూజారులపై దాడి కేసులో వైకాపా నాయకులే నిందితులు. మరి జాబితాలో వారి పేర్లేవి? ఇది మీ చేతగానితనం కాదా?’ అని తెదేపా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

అసలు నిందితులు మంత్రులే: జవహర్‌

‘తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మంత్రులను అరెస్టు చేయకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని పట్టుకున్నామని డీజీపీ సవాంగ్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇది సరైన విధానం కాదు’ అని తెదేపా మాజీ మంత్రి జవహర్‌ మండిపడ్డారు.

పదవి సవాంగ్‌ది.. పవర్‌ సజ్జలది: బుద్దా వెంకన్న

‘డీజీపీ పదవిలో గౌతమ్‌ సవాంగ్‌ ఉన్నా పోలీస్‌ శాఖలో పవర్‌ మాత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిదే అన్నట్లు ఉంది. ఆలయాలపై దాడులు చేసిన వైకాపా నేతలు, ఆగంతకులను వదిలేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని నిందితులుగా చూపించడం నెవ్వర్‌ బిఫోర్‌.. నెవ్వర్‌ ఆఫ్టర్‌’ అని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు.
24 గంటల్లో జే టర్న్‌ ఎందుకు?
విగ్రహాల ధ్వంసం ఘటనల్లో రాజకీయం లేదని చెప్పిన 24 గంటల్లోనే జే టర్న్‌ ఎందుకు తీసుకున్నారో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సమాధానం చెప్పాలని తెదేపా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను నిష్పక్షపాతంగా పట్టుకోవాలని, ఎల్లకాలం ఎవరూ అధికారంలో ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే డ్రామా: భాజపా
ప్రజల దృష్టి మరల్చేందుకే పోలీసులు రాజకీయ డ్రామాకు తెరలేపారని భాజపా రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ఆరోపించారు. అన్యమతస్తుల కారణంగానే దేవాలయాలపై దాడులు జరుగుతున్నట్లు తేటతెల్లమైందని శుక్రవారం ప్రకటన జారీచేశారు. ‘దేవాలయాలపై దాడుల ఘటనలో నలుగురు భాజపా కార్యకర్తల హస్తం ఉందని రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. డీజీపీ గౌతంసవాంగ్‌ 48 గంటల ముందు విలేకర్ల సమావేశంలో దేవాలయాల ధ్వంసంలో ఎలాంటి కుట్రకోణం లేదన్నారు. ఈ రోజు పోలీసులు విడుదల చేసిన ప్రకటన ఉపసంహరించుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసుకు, దేవాలయాల కూల్చివేత, విగ్రహాల ధ్వంసం కేసులకు తేడా తెలియని పరిస్థితుల్లో ఏపీ పోలీసులు ఉన్నారు’’ అని మండిపడ్డారు.
నిక్కచ్చిగా దర్యాప్తు చేయండి
‘పాస్టర్‌ ప్రవీణ్‌ అరెస్టును పక్కదారి పట్టించి, దాడుల ఘటనలపై ప్రతిపక్షాల మీద నెపం వేసేందుకు వైకాపా నేతల ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు విగ్రహాల ధ్వంసానికి తేనెతుట్టెలు, పిచ్చోళ్లు, పిల్లులు అని చెప్పిన వైకాపా నేతలు ఇప్పుడేమో రాజకీయ నాటకాలు ఆడుతున్నారు. పోలీసులు నిక్కచ్చిగా శోధన చేయాలి’ అని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి

ఆలయాల ఘటనలపై పార్టీల దుష్ప్రచారం: డీజీపీ

Last Updated : Jan 16, 2021, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.