ETV Bharat / city

Perni nani on website servers down: ఆందోళన వద్దు.. వాహనదారులకు మరో అవకాశం: మంత్రి పేర్ని నాని - నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్

Minister perni nani on Vehicle registrations: గురువారం రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంపై రవాణాశాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు కొనుగోలు చేసిన వాహనాలకు జనవరి 1 తర్వాత మరో అవకాశం కల్పించినట్టు తెలిపారు.

Minister perni nani on website servers down

author img

By

Published : Dec 31, 2021, 3:30 AM IST

Updated : Dec 31, 2021, 4:42 AM IST

ఆందోళన వద్దు.. వాహనదారులకు మరో అవకాశం: మంత్రి పేర్ని నాని

Minister Perni nani on Transport Department website servers down: : రవాణా శాఖలో సర్వర్లు నిలిచిపోవడం వల్లే పౌరసేవలు తాత్కాలికంగా స్తంభించాయని, పునరుద్దరణకు నిపుణులు ప్రయత్నిస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాహనదారులు ఇప్పుడు కొనుగోలు చేసిన వాహనాలకు జనవరి 1 తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ప్రస్తుత పన్నులనే చెల్లించేలా అవకాశం కల్పించినట్టు తెలిపారు. దీనికోసం జనవరి 1కి ముందు వాహనం కొనుగోలు చేసినట్టు తగిన ధృవపత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు. ఈ ఆదేశాన్ని ఇప్పటికే వివిధ జిల్లాల రవాణాశాఖ అధికారులు, డీలర్లకు తెలిజేసినట్టు మంత్రి వెల్లడించారు. వాహనదారులు ఆందోళన చెందవద్దని కోరారు.

పలు చోట్ల డీలర్లతో వాగ్వాదం..

Department of Transport website servers down in AP: వాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడ్డారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగనున్నాయి. ఈనేపథ్యంలో.. అంతకు ముందే వాహనాలు కొనేందుకు వాహనదారులు ప్రయత్నిస్తున్నారు. వాహనం డెలివరీ చేయకపోవడంతో పలు చోట్ల వినియోగదారులు డీలర్లతో వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన రవాణాశాఖ మంత్రి పేర్ని నాని... వాహనదారులు ఆందోళన చెందవద్దని.. మరోఅవకాశం కల్పిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి..

రవాణాశాఖ వెబ్​సైట్​లో సాంకేతిక సమస్య...నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు

Last Updated : Dec 31, 2021, 4:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.