ఏపీ మాక్స్ చట్టంతో పాటు ఇతర సహకార చట్టాల్లో సవరణలకు సంబంధించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. సహకార శాఖ పూర్తి కంప్యూటరీకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విజయవాడలోని అప్కాబ్ భవన్లో సహకార బ్యాంకుల పనితీరుపై సమీక్షించిన మంత్రి.. కంప్యూటరీకరణకు గడువు నిర్దేశించుకోవాలని సూచించారు. సహకార సంఘాలను బలోపేతం చేయటం, నిధుల దుర్వినియోగానికి తావులేకుండా నిరంతర ఆడిట్ విధానం అనుసరించాలని మంత్రి సూచనలు చేశారు. అభియోగాలు, ఆరోపణలు నిరూపణ అయితే తక్షణం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ... అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్