ETV Bharat / city

RAINS: హైదరాబాద్​లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - హైదరాబాద్​లో భారీ వర్షం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పడిన వానకు వివిధ పనుల నిమిత్తం బయటకొచ్చిన ప్రజలు తడిసిపోయారు. రహదారులపై నీరు చేరి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

heavy rains in Hyderabad
హైదరాబాద్​లో భారీ వర్షం
author img

By

Published : Aug 28, 2021, 6:56 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షం తాకిడిని తట్టుకునేందుకు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు.

నగరంలోని హైదర్​గూడ, బషీర్​బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్​, నాంపల్లి, హిమాయత్​నగర్​, లిబర్టీ, లక్డీకపూల్​, ట్యాంక్​బండ్, సూరారం, జీడిమెట్ల, ఎల్బీనగర్​, నాగోల్, మన్సూరాబాద్​, వనస్థలిపురం, హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడం వల్ల వివిధ పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు..

మరోవైపు.. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వ్యాపించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాని ప్రభావం వల్ల రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చూడండి:

Rains: రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.