ETV Bharat / city

Fake Aadhar: ఆధార్​కార్డ్, పాన్​కార్డ్​ జిరాక్సులతో క్లోనింగ్.. సైబర్​ నేరగాళ్ల కొత్త మోసాలు - Fake pan cards

Fake Aadhar: రోజురోజుకూ ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకులు, ప్రైవేటు సంస్థల్లో రుణాలు తీసుకునేందుకు... ఆధార్‌, పాన్‌కార్డుల జిరాక్స్‌ కాపీలు ఇస్తున్నవారి వివరాలతో... వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తున్నారు. నకిలీ కంపెనీలు సృష్టించి... కోట్లలో టర్నోవర్‌ చూపించి... లక్షల్లో రుణాలు తీసుకుంటున్నారు. బాధితులకు బ్యాంకు నోటీసులు రావడం వల్ల ఇవన్నీ బయటపడుతున్నాయి. వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు... దిల్లీ, ముంబయి సైబర్ నేరస్థులు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

Fake Aadhar
Fake Aadhar
author img

By

Published : Mar 3, 2022, 10:24 AM IST

Fake Aadhar: హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌కు చెందిన శేషగిరిరావు... కొద్దిరోజుల క్రితం ఓ కార్పొరేట్‌ బ్యాంకులో పొదుపు ఖాతా తెరిచేందుకు వెళ్లాడు. వివరాలన్నీ బ్యాంకు అధికారులకు ఇచ్చాక... పదేళ్ల క్రితమే మీరు కాన్పూర్‌లోని మా బ్యాంకులో ఖాతా తెరిచారు. ఆ ఖాతాలో ఇంకా లావాదేవీలు కొనసాగుతున్నాయని... అక్కడి ఖాతాను రద్దు చేసుకుని వస్తే ఇక్కడ ప్రారంభిస్తామని చెప్పారు. తాను ఇంతవరకు కాన్పూర్‌ వెళ్లలేదని శేషగిరిరావు చెప్పినా... బ్యాంకు అధికారులు వినిపించుకోలేదు. తనకు తెలియకుండా ఇంకెవరో ఖాతా ప్రారంభించారంటూ బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదులు...

యాకుత్‌పురాలో ఉంటున్న మరో వ్యక్తి అబ్దుల్‌కు రూ. 26 లక్షల 22 వేలు జీఎస్టీ చెల్లించాలని అధికారులు తాఖీదులు పంపించారు. చిన్న ఎలక్ట్రికల్‌ షాప్‌ నిర్వహిస్తున్న అబ్దుల్‌... ఏడాదంతా విద్యుత్‌ పరికరాలు అమ్మినా... రూ. 5 లక్షలు రావని జీఎస్టీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వివరించారు. నీ పేరుమీద కంపెనీలున్నాయి... కోట్లలో టర్నోవర్‌ చూపించారని అధికారులు చెప్పారు. దీంతో షాకైన అబ్దుల్‌... పోలీసులను ఆశ్రయించాడు. ముషీరాబాద్‌లో ఉంటున్న మహిళ కానిస్టేబుల్‌ వ్యక్తిగత రుణం కోసం 4 నెలల క్రితం బ్యాంకుకు వెళ్లారు. ఆమె పాన్‌కార్డును పరిశీలించిన అధికారులు... ఇప్పటికే మీరు 8 సార్లు రుణం తీసుకున్నారని తెలిపారు. దీంతో కంగుతిన్న ఆమె... సైబర్‌ క్రైమ్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

పొరుగుసేవల విభాగాల నుంచి సేకరణ...

సైబర్‌ నేరగాళ్లు పాన్‌కార్డుతో అనుసంధానమైన జాతీయ, కార్పొరేట్‌ బ్యాంకుల ఖాతాదారుల వివరాలను పొరుగుసేవల విభాగాల నుంచి సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆధార్‌, పాన్‌ కార్డులను క్లోనింగ్‌ చేస్తున్నారు. వాటిపై తమ ఫొటోలను అతికించి చిరునామాలను మారుస్తున్నారు. వాటి ఆధారంగా రుణాలు తీసుకుంటున్నారు. క్లోనింగ్‌ కార్డుల ద్వారా జీఎస్టీ ఇన్‌పుట్‌ క్రెడిట్‌ తీసుకుని... దిల్లీ, ముంబయి, గోవా, బెంగుళూరులో వేర్వేరు వస్తువులు తయారు చేస్తున్న కంపెనీలను సృష్టిస్తున్నారు. చిరునామా మాత్రం బాధితులదే ఉంచుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాగానే విత్‌డ్రా చేసుకుని మూసేస్తున్నారు.

ఇదీ చూడండి: Bus Driver Misbehavior: ప్రయాణికురాలితో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అసభ్య ప్రవర్తన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.