covid cases in vijayawada government hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యులకు పాజిటివ్‌గా తేలింది. వీరితోపాటు 25 మంది జూనియర్ వైద్యులు, పలువురు పారామెడికల్ సిబ్బందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి..
Corona cases in India: మరోవైపు దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,38,018 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 310 మంది మరణించారు. 1,57,421 మంది కోలుకున్నారు. కరోనావ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 3,76,18,271
- మొత్తం మరణాలు: 4,86,761
- యాక్టివ్ కేసులు: 17,36,628
- మొత్తం కోలుకున్నవారు: 3,53,94,882
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 79,91,230 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,58,04,41,770కు చేరింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 19,79,856 మందికి కరోనా సోకింది. 4,987 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 33,12,64,767కి చేరగా.. మరణాలు 55,63,226కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 3,89,553 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 468 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.7 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 1,02,144 కేసులు వెలుగుచూశాయి. మరో 296 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో మరో 84,429 మంది వైరస్ బారిన పడ్డారు. 85 మంది మృతి చెందారు.
- ఇటలీలో 83,403 కొత్త కేసులు బయటపడగా.. 287 మంది మరణించారు.
- స్పెయిన్‌లో 1,10,489 మందికి కొత్తగా వైరస్ సోకింది. మరో 78 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి