శ్రీకాకుళంలో...
పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ శ్రీకాకుళంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షులు బోడేపల్లి సత్యవతి సమక్షంలో సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నించలేక భయాందోళనకు గురవుతున్నారని నేతలు ఆందోళన చెందారు.
విశాఖపట్నంలో...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర శాఖ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని సిరిపురం పెట్రోల్ బంకు వద్ద సంతకాల సేకరణ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకమే అని మండిపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ... తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైకిల్ తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. అంబాజీపేట బస్ స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సైకిళ్లపై వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ ఎల్. జోసఫ్‌కు వినతి పత్రం అందజేశారు.
ప్రకాశం జిల్లాలో...
అద్దంకిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను పెంచడాన్ని నిరసిస్తూ... రామ్‌నగర్‌లోని భారత్ పెట్రోల్ బంకు వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో నియోజకవర్గ ఇంఛార్జి నన్నూరి సీతారామాంజనేయులు, పీసీసీ సభ్యులు కోరే సురేంద్రనాధ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కబలా సుబ్రహ్మణ్యం, డీసీసీ కార్యదర్శి బొంతకర్ల శ్రీనివాసరావు యాదవ్, వాసవీ క్లబ్ అధ్యక్షులు అత్తులూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: