CM Jagan Birthday: సీఎం జగన్ జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలోని గోశాల ముందు సేంద్రీయ సాగు కళ(ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్)తో గడ్డి ఉపయోగించి నేలపైన జగన్ ముఖచిత్రాన్ని తీర్చిదిద్దారు. వంద అడుగుల పొడవు, వెడల్పుతో 2డి ఆర్కిటెక్చర్ సాంకేతికతతో కాంత్ రీషా అనే కళాకారుడి చేత చెవిరెడ్డి దీనిని తీర్చిదిద్దించారు. ఇందుకోసం పది రోజులు పట్టినట్లు చెవిరెడ్డి తెలిపారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్‌పై ‘వర్ధిల్లు వెయ్యేళ్లు’ అంటూ రూపొందించిన ఆడియోను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విడుదల చేశారు. సజ్జల మాట్లాడుతూ పేదలు అన్ని రంగాల్లో పోటీ పడేలా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
మొక్కలు నాటాలి..
‘సీఎం జగన్ జన్మదినం సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించాం’ అని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:
AP Govt On DA: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు