ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత అప్పు చేసేందుకు ఏపీ అభ్యర్థించిందని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. మరో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు అనుమతి కోరిందని పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో అప్పు చేసేందుకు సీఎం విజ్ఞప్తి చేశారని.. కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించారు. గత నెల దిల్లీ పర్యటనలో సీఎం జగన్ కోరారని చెప్పారు. 2021-22లో ఉన్న పరిమితిని రూ.42,472 కోట్లకు పెంచాలని అభ్యర్థించారని తెలిపారు. తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి రాజ్యసభలో బదులిచ్చారు.
సెక్యూరిటీ బాండ్ల వేలం..
ఆర్‌బీఐ ద్వారా మరోసారి సెక్యూరిటీ బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. సెక్యూరిటీ బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు రుణం పొందింది. 7.37 శాతం మేర వడ్డీకి సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 16 ఏళ్ల కాలపరిమితితో వెయ్యి కోట్లు, 20 ఏళ్ల పరిమితితో మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది.
ఇదీ చదవండి
CM Jagan-Cinema Stars Meet: ఎల్లుండి సీఎం జగన్తో సినీ ప్రముఖుల సమావేశం