బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియను జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఆమెకు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం అఖిలప్రియను బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గురువారం ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
పిటిషన్ దాఖలు...
అఖిల్ ప్రియ అరెస్ట్ పై బెయిల్ పిటిషన్ దాఖలైంది. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై వాదనలు గురవారానికి వాయిదా పడ్డాయి.
అసలేం జరిగింది...
బోయిన్‌పల్లిలో మంగళవారం రాత్రి బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ కలకలం సృష్టించింది. ఈ ముగ్గురి కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ దంపతుల ప్రమేయంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఓ భూవివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, భూమా అఖిల ప్రియ కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి
కిడ్నాప్ కేసులో ట్విస్ట్: ఏ-1 ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ-2గా అఖిలప్రియ