దళిత ఐకాస అమరావతి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి నుంచి.. పశ్చిమగోదావరి జిల్లాలోని నిర్మలగిరి పుణ్యక్షేత్రానికి రైతులు బస్సు యాత్ర చేపట్టారు. సీఎం జగన్ మనసు మారేలా మరియమ్మను వేడుకుంటామన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధానిలో పనుల్లేక తామంతా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో తమ బిడ్డల భవిష్యత్తు నాశనం చేశారని ఆరోపించారు. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే శ్రీదేవి.. నేడు తాము చేస్తున్న ఉద్యమాన్ని అవమానిస్తోందని మండిపడ్డారు. అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి.. వెలగపూడిలో 151 మంది దళిత రైతుల దీక్ష