ETV Bharat / city

'బ్లాక్‌ ఫంగస్‌ కేసులొస్తే.. సమాచారమివ్వాలి' - Black Fungus cases in AP

కరోనాతో మృతి చెందిన వారి పిల్లలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి చిన్నారి పేరున 10 లక్షల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ సత్ఫలితాలిస్తోందని, కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే దీనికి నిదర్శమని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో రోజుకు 50 వేల మందికి టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా వైద్య సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Anil Kumar Singhal
అనిల్‌ కుమార్‌ సింఘాల్‌
author img

By

Published : May 18, 2021, 8:13 AM IST

అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిని నోటిఫై చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఈ కేసులు వస్తే ప్రైవేట్‌ ఆసుపత్రులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. వీటి ఆధారంగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి ప్రభావం రాష్ట్రంలో ఎంత ఉంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయని.. మరణాలు మాత్రం సంభవించలేదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి ఉచితంగా ఈ వైద్య సేవలూ అందుతాయని వెల్లడించారు.

కరోనా కారణంగా మరణించిన వారి పిల్లలు అనాథలు కాకుండా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయబోతుందని వెల్లడించారు. 24 గంటల్లో 600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి నివారణకు అవసరమైన మందులు, ఇంజెక్షన్ల కొనుగోలుకు స్వల్పకాలిక టెండర్లు పిలవబోతున్నాం. ప్రతి బోధనాసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. కర్ఫ్యూ విధించడం వల్ల 2 జిల్లాల్లో కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి’ అని అన్నారు.

3 రోజుల్లో 91 వేల మంది జ్వర పీడితుల గుర్తింపు

'రాష్ట్రంలో 3 రోజుల ఇంటింటి సర్వేలో జ్వరంతో బాధపడేవారు 91 వేల మంది ఉన్నారని గుర్తించాం. వీరి నుంచి నమూనాల సేకరణతో పాటు హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేస్తున్నాం. అవసరమైన వారిని ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించాం. నెగెటివ్‌ రిపోర్టులను వెల్లడించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్‌ సేవలు వినియోగించుకుంటున్నాం. రాష్ట్రంలో 24 గంటల్లో 4,551 మంది డిశ్ఛార్జి కాగా... 6,884 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు. 6,421 ఐసీయూ పడకలకు 6,058, 23,393 ఆక్సిజన్‌ పడకలకు 22,960 చొప్పున నిండాయి. ప్రస్తుతం 67% మంది కరోనా వైరస్‌ బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 34 తాత్కాలిక షెడ్ల ద్వారా పడకలు అందుబాటులోకి వస్తాయి' అని అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వివరించారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.