ETV Bharat / city

Amaravathi padayatra: ఆంక్షలు ఎదురైనా సడలని సంకల్పం.. అకుంఠిత దీక్షతో యాత్ర పూర్తి

Amaravathi padayatra news: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పూర్తి అయింది. 4 జిల్లాల్లో 44 రోజులపాటు సాగిన యాత్రకు.. అడుగడుగునా ఎదురైనా ఆంక్షలను సంకల్పంతో జయించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులనూ ముందుకు సాగారు. ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా 450 కిలోమీటర్లు నిర్విరామంగా నడిచారు. రాజధాని అమరావతిని కాపాడుకోవాలన్న దృఢ సంకల్పంతో అమరావతి ఆకాంక్షను రాష్ట్రమంతా చాటి చెప్పారు. రాష్ట్రం నలుమూలలు, దేశవిదేశాల నుంచీ వచ్చిన వారు ఇచ్చిన మద్దతుతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' అనే నినాదంతో మహా పాదయాత్రను అకుంఠిత దీక్షతో పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో నేటినుంచి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కింద తితిదే ఏర్పాట్లు చేసింది. మరోవైపు.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

మహాపాదయాత్ర
Amaravathi Mahapadayathra
author img

By

Published : Dec 15, 2021, 7:29 AM IST

Amaravati padayatra: రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులు యాత్ర పూర్తైన నేపథ్యంలో నేటినుంచి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. మరోవైపు తిరుపతిలో బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరించగా రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 17న బహిరంగ సభ నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' మహాపాదయాత్ర జరిగిన 44 రోజులలో ముఖ్య ఘట్టాలు..

రాజధాని రైతులు నవంబరు 1న తుళ్లూరు నుంచి ప్రారంభించిన మహాపాదయాత్రకు కుల, మత, ప్రాంతమన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి విశేష ఆదరణ, స్పందన లభించాయి. అమరావతిని కాపాడుకునేందుకు రైతులు పడుతున్న తపన అందర్నీ కదిలించింది. రైతులకు దారి పొడవునా ప్రజలు హారతులిస్తూ, పూలు జల్లుతూ, స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, బాజాభజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. రోజూ సగటున ఐదారు వేల మందికి తగ్గకుండా పాదయాత్రలో పాల్గొన్నారు. మహిళా రైతుల్ని తోబుట్టువుల్లా భావించి.. కొన్నిచోట్ల తమ ఇళ్లకు తీసుకెళ్లి బస ఏర్పాట్లు చేశారు.

పాదయాత్ర సాగే మార్గానికి చుట్టుపక్కల 20 కి.మీ.ల దూరం నుంచీ రైతులు, స్థానికులు వచ్చి సంఘీభావం పలికారు. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, న్యాయవాదులు, చార్టర్డ్‌ అకౌంటెంట్‌లు, డాక్టర్లు, వ్యాపారులు తదితర వర్గాల వారు మద్దతు పలికారు. రాత్రిపూట భోజనాలు, ఉదయం అల్పాహారం ఎక్కడికక్కడ స్థానికులే ఏర్పాటు చేశారు. రాజధాని గ్రామాలతో సంబంధంలేని వారు... అమరావతికి మద్దతుగా, రైతులకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. కొందరు తుదివరకు కూడా నడిచారు. పాదయాత్రికుల సగటు వయస్సు 50 సంవత్సరాలకుపైనే ఉంటుంది. 70 ఏళ్లు దాటిన వృద్ధులూ, మహిళలూ ఉన్నారు. కాళ్లకు పుండ్లు పడ్డా.. ముందుకే సాగారు.

.

ఇతర రాష్ట్రాలూ, విదేశాల నుంచీ..!

పాదయాత్ర 4జిల్లాల్లోనే కొనసాగినా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పలు జిల్లాల రైతులు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె, రాజంపేట, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల నుంచీ వచ్చారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, మహారాష్ట్రలోని పుణె, పింప్రి, చించ్‌వాడ, భోసారి, కర్ణాటకలోని బెంగళూరు, సింధనూరు, బళ్లారి, రాయచూరు, మాన్వి, గంగావతి, తమిళనాడులోని చెన్నై వంటి ప్రాంతాల నుంచి రైతులు వచ్చి మద్దతు తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి ప్రవాసాంధ్రులు కొందరు వచ్చి సంఘీభావం పలికారు.

రూ.100 నుంచి రూ.లక్షల్లో విరాళాలు

Amaravathi Mahapadayathra: రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని కోరుకుంటున్న అనేకమంది పాదయాత్రకు ఆర్థికంగా బాసటగా నిలిచారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారు ప్రాంతమైన ఎర్రజర్లలో ఓ దిగువ మధ్యతరగతి మహిళ పాదయాత్ర చేసుకున్న మహిళల కష్టం చూసి కన్నీరు పెట్టుకుని, తాను దాచుకున్న కొద్దిపాటి మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. చదలవాడ దగ్గర ఒక విశ్రాంత ప్రభుత్వోద్యోగి భార్య చేతికున్న ఉంగరం ఇచ్చేశారు. ప్రకాశం జిల్లా ఎన్‌.ఎన్‌.కండ్రిక వాసి కిరణ్‌కుమార్‌ అనే పేద రైతు రూ.500 విరాళమిచ్చారు. రూ.100 నుంచి రూ.లక్షల్లో విరాళాలు ఇచ్చినవారు అనేక మంది ఉన్నారు. పిల్లలు కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బునిచ్చారు. ప్రవాసాంధ్రులు రైతులకు బూట్లు సమకూర్చడంతోపాటు, భారీగా విరాళాలు అందజేశారు.

.

పోలీసుల ఆంక్షల మధ్యే...

మహాపాదయాత్ర పోలీసుల ఆంక్షలతోనే మొదలై, ఆంక్షల మధ్యే ముగిసింది. నవంబరు 11న ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద... పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. లాఠీఛార్జి చేయడంతో స్థానిక రైతు ఒకరి చేయి విరిగింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో యాత్ర సాఫీగానే సాగినా... నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో రైతుల్ని పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టారు. పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు.

.

వైకాపా తప్ప అన్ని పార్టీల మద్దతు
Amaravathi Mahapadayathra: మహాపాదయాత్రకు వైకాపా తప్ప అన్ని పార్టీలూ బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. తెదేపా నాయకులు ఎక్కడికక్కడ పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశించడంతో... రాష్ట్రానికి చెందిన భాజపా ముఖ్య నాయకులంతా సంఘీభావం ప్రకటించారు. యాత్రలో నడిచారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతోపాటు నారాయణ, రామకృష్ణ, సీపీఎం అగ్రనాయకుడు రాఘవులు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి... రైతులు బస చేసిన ప్రాంతానికి వెళ్లి వారిని పలకరించారు.

అమరావతిని ప్రకటించే వరకు పోరాడతాం

అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటించేలా చూడాలని వేంకటేశ్వరున్ని వేడుకుంటూ.... మహాపాదయాత్రను నవంబరు 1న ప్రారంభించాం. నాటి నుంచి నాలుగు జిల్లాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల రైతులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అడుగడుగునా అన్ని రాజకీయ పార్టీల నాయకులు మద్దతుగా నిలిచి తిరుపతి వరకు నడిపించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో అమరావతియే రాజధాని అని ప్రకటించే వరకు మా ఉద్యమం ఆగదు. - శివారెడ్డి, అమరావతి ఐకాస కన్వీనర్‌

పాదయాత్రలో 80% మహిళలే

మహాపాదయాత్రను 80% మంది మహిళలు ముందుండి నడిపించారు. ఎన్నో సమస్యలను, ఇబ్బందులను ఓర్చుకుని నడిచారు. రాష్ట్ర, భావితరాల భవిష్యత్తును తమ భుజాన వేసుకొని అలసట, బాధను అధిగమించి గమ్యానికి చేరుకున్నారు. పాదయాత్రలో మంగళహారతులు పడుతూ, పాదపూజలు చేస్తూ తోటి మహిళలు ఇచ్చిన ధైర్యం, బలం మరింత ముందుకు నడిపించింది. మహిళలు, రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అమరావతి సాధిస్తామం. -డాక్టర్‌ రాయపాటి శైలజ, అమరావతి ఐకాస మహిళా కన్వీనర్‌

ఇది దైవ సంకల్పమే..

Amaravathi Mahapadayathra: ఏకంగా 44 రోజుల మహాపాదయాత్రలో వేలాది మంది రైతులు, వృద్ధులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. ఇది దైవ సంకల్పంగా భావిస్తున్నాం. రెండు సంవత్సరాలుగా రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారింది. అందుకే శ్రీవేంకటేశ్వరస్వామి మాచే ఈ మహాపాదయాత్ర చేయించారని నమ్ముతున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే వయసును సైతం లెక్కచేయకుండా కుటుంబాలను వదిలి పాదయాత్ర చేశాం. - తిరుపతిరావు, అమరావతి ఐకాస కో కన్వీనర్‌

ఇదీ చదవండి...

mahapadayatra: ముగిసిన అన్నదాతల యాత్ర...అమరావతిని రక్షించాలని స్వామీకి విన్నపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.