రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టటం దాదాపుగా ఖాయం కావటంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ నివాసం సహా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద అదనపు బలగాలను మోహరించారు. జగన్ ఇంటివద్దకు జిల్లా ఐజీ సహా ఉన్నతాధికారులు చేరుకుని భద్రతను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేశారు. జగన్ కాన్వాయ్‌లో చేరేందుకు అదనంగా ఎస్కార్ట్ వాహనాలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నాయి. జగన్ నివాసానికి, కార్యాలయానికి రాకపోకలు సాగించే దారుల వద్ద పోలీసు పికెటింగ్ పెంచారు.
జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు - జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా వైఎస్ అధికారం చేపట్టటం దాదాపుగా ఖాయం కావటంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.