లండన్‌లో స్థిరాస్తుల కొనుగోలు సహా ఇతర లావాదేవీలపై ఈడీ అధికారులు వాద్రాను విచారిస్తున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
ఇవీ ఆరోపణలు...
రాబర్ట్ వాద్రా లండన్‌లో 1.9మిలియన్ పౌండ్లు విలువైన ఆస్తులు కలిగి ఉన్నారన్నది ఆరోపణ. ఇందుకోసం మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే అనేక చోట్ల సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది.
అక్రమాస్తుల కేసులో గతవారం వాద్రాకు దిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు నిర్దేశం మేరకు నేడు రాబర్ట్ వాద్రా ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
వాద్రాతో పాటు ఆయన భార్య ప్రియాంక కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. వాద్రా లోపలికి వెళ్లిన కాసేపటికి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.