ETV Bharat / snippets

పదో తరగతి అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - 73.03 శాతం ఉత్తీర్ణత

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 4:50 PM IST

TG SSC Supplementary Results 2024
TG SSC Supplementary Results 2024 (ETV Bharat)

TG SSC Supplementary Results 2024 : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 73.03 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు హాజరైన 46,731 మంది విద్యార్థుల్లో 34,126 మంది పాస్​ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలురు 71.01 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 76.37 శాతంగా ఉంది. రీకౌంటింగ్​, రీవెరిఫికేషన్​ దరఖాస్తులకు జులై 8 వరకు అవకాశం కల్పించారు.

అడ్వాన్స్​ డ్​ సప్లిమెంటరీ ఫలితాల్లో నిర్మల్​ జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచింది. కేవలం 42.14 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్​ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఆదిలాబాద్​, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, కరీంనగర్​, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, వనపర్తి, నాగర్​కర్నూల్​ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు అయింది. www.bse.telangana.gov.in వెబ్ సైట్​లో ఫలితాలు చూసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.