ETV Bharat / snippets

రైలు ఢీకొని - ఐదు కిలోమీటర్ల పాటు ఇంజిన్​కు వేలాడుతూ?

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 9:01 AM IST

Old man died after being hit by that train
Old man died after being hit by that train (ETV Bharat)

Old man died after being hit by that train: మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​లో రైలుకు వేలాడుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రైలుపట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని రైలు ఢీకొట్టి, మృతదేహంతో వేలాడుకుంటూ ఘట్​కేసర్ రైల్వే స్టేషన్ వరకు తీసుకువచ్చింది. ఆ దృశాన్ని ఘటకేసర్​లోని రైల్వే గేటు వద్ద వాహనాదారులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ట్రైన్ ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు. బీబీనగర్-ఘటకేసర్ రైల్వేస్టేషన్ మధ్య ఓ గుర్తుతెలియని వృద్ధుడు పట్టాలు దాటుతుండగా వరంగల్ వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు రైలు ముందు భాగానికి చిక్కుకొని సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు అలాగే వేలాడుతూ వచ్చింది. మృతుడు నీలంరంగు చొక్కా వేసుకుని, ఆరేంజ్ రంగు లుంగీ, కుడిచేతికి కడెం ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.