ETV Bharat / snippets

కేయూ హాస్టల్‌లో ఫ్యాను ఊడిపడి విద్యార్థిని తలకు గాయం

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 9:50 AM IST

student injured
student injured (ETV Bharat)

KU student injured: కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్‌లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లునావత్‌ సంధ్య కేయూలోని పోతన హాస్టల్‌ గది నం.19లో ఉంటూ రాజనీతిశాస్త్రం మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి భోజనం తరువాత గదికి వచ్చిన ఆమె మంచంపై తన వస్తువులు సర్దుకుంటుండగా, సీలింగ్‌ ఫ్యాను ఒక్కసారిగా ఊడి మీద పడటంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. తోటి విద్యార్థినులు వెంటనే హాస్టల్‌ సూపర్‌వైజర్‌ శోభ సహాయంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె గాయానికి 14 కుట్లు వేశారు. ప్రమాద ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు హాస్టల్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టల్‌లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. పాత భవనంలో ఎప్పుడో బిగించిన ఫ్యాన్లు అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.