ETV Bharat / snippets

మిర్యాలగూడలో ఫ్లైఓవర్‌పై ఢీకొన్న రెండు కార్లు - ఒకరికి తీవ్ర గాయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 3:47 PM IST

Car Accident In Nalgonda District
Car Accident In Nalgonda District (ETV Bharat)

Car Accident In Nalgonda District : నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్​పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. హైదరాబాద్​ నుంచి ఇద్దరు సాఫ్ట్​వేర్ ఉద్యోగులు గుంటూరు​ వైపు వెళ్తుండగా హనుమాన్​ పేట ఫ్లై ఓవర్​పై నల్గొండ వైపు వెళ్తున్న ఓ కారు ఢీకొట్టింది.

దీంతో రెండు కార్లు ముందుభాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగే సమయంలో కారులో ఎయిర్​ బ్యాగ్స్​ ఓపెన్​ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.