ETV Bharat / snippets

రాష్ట్రంలో కులగణనపై నిపుణులతో బీసీ కమిషన్​ భేటీ - పలు అధ్యయనాలపై చర్చ

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 7:13 PM IST

Caste Census In Telangana
BC Commission on Caste Census In Telangana (ETV Bharat)

BC Commission on Caste Census In Telangana : రాష్ట్రంలో త్వరలో చేయబోయే కులగణన కోసం బీసీ కమీషన్ నిపుణులతో భేటీ అయ్యి వాటి విధివిధానాల గురించి మేధావులతో చర్చించి సలహాలు తీసుకుంది. ప్రశ్నావళి రూపంలో సలహాలను, సూచనలను కోరింది. రాష్ట్రంలో చేపట్టబోయే కులగణనకు సంబంధించి తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలపాలని పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ సంస్థ బీసీ కమిషన్​ను కోరింది. కుల సర్వేకు సంబంధించి పూర్తి విధివిధానాలు ఖరారు చేయాలని బీసీ కమిషన్​ను తెలిపింది.

కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ బృందంలో కమిటీ సభ్యులు సమావేశమై లిఖిత పూర్వకంగా పలు అధ్యయన పత్రాలు సమర్పించింది. బిహార్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కులగణన జరిపిన విధానంపై లోతుగా చర్చించారు. అక్కడ ఎదురైన సమస్యలను చర్చించి జాగ్రత్తలు సూచించారు. కుల సర్వే కోసం త్వరలో మేధావులు, ప్రజా సంఘాలతో చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిషన్ ఛైర్మన్ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.