Kohli Announces Retirement T20cricket : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విరాట్ ఈ విషయాన్ని ప్రకటించాడు. "ఇదే నా చివరి టీ20 వరల్డ్‌కప్. టీమ్ఇండియా తరఫున ఇదే నా చివరి టీ20మ్యాచ్. మేం అనుకున్నది సాధించాం. మా కల నెరవేరింది. టీమ్ఇండియాకు ఆడేందుకు వచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం. పరుగులు చేయలేకపోతున్నాం అని అనిపించినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మాలో చాలా మంది ఈ కప్ గెలవాలని కలలు కన్నాం. ఇప్పటికీ అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఇప్పుడు టీ20ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతరానిది భవిష్యత్తులో భారత్ మరిన్ని మెగా ట్రోఫీలు సాధిస్తుందని ఆశిస్తున్నాను." అని పేర్కొన్నాడు.
కోహ్లీ షాకింగ్ డెసిషన్ - T20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్
Published : Jun 30, 2024, 12:01 AM IST
|Updated : Jun 30, 2024, 12:27 AM IST