ETV Bharat / snippets

నీరజ్‌ చోప్రా పసిడి త్రో

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 6:27 AM IST

source ANI
Neeraj chopra (source ANI)

Neeraj Chopra Goid Medal Paavo Nurmi 2024 : పారిస్‌ ఒలింపిక్స్‌ ముందు భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా సూపర్​ ఫామ్‌ ప్రదర్శిస్తున్నాడు. ఫిన్లాండ్‌లో జరిగిన పావో నూర్మి క్రీడల్లో అతడు గోల్డ్​ మెడల్​ సాధించాజు. జావెలిన్‌ను ఉత్తమంగా 85.97 మీటర్లు విసిరి టాప్​లో నిలిచాడు. మొదటి రెండు ప్రయత్నాల్లో 83.62 మీ, 83.45 మీటర్లు విసిరిన నీరజ్‌ ఆరంభంలో మాత్రం వెనుకపడ్డాడు. కానీ మూడో త్రోలో 85.97 మీటర్లతో అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. అనంతరం అంతకుమించిన ప్రదర్శన చేయకపోయినప్పటికీ (82.21 మీ, ఫౌల్, 82.97 మీ) గోల్డ్​ మెడల్​ను దక్కించుకున్నాడు. ఫిన్లాండ్‌ ప్లేయర్​ టోని (84.19 మీ), అలివర్‌ (83.96 మీ) సిల్వర్​, బ్రాంజ్ మెడల్స్​ సాధించారు. మాజీ నంబర్‌ వన్‌ ప్లేయర్​ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా, 82.58 మీ) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.