ETV Bharat / snippets

'డక్ వర్త్ లూయిస్' రూపకర్త కన్నుమూత!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 8:47 AM IST

source ANI
DLS Method Inventor FrankDuckworth Dies (source ANI)

DLS Method Inventor FrankDuckworth Dies : క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. డక్​వర్త్ లూయిస్ పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్​ డక్​వర్త్(84) కన్నుమూశారు. అయితే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్య సమస్యల కారణంగా ఈ నెల 21నే డక్​వర్త్ మరణించినట్లుగా ఓ ఇంగ్లీష్​ వెబ్​సైట్ ద్వారా ఆలస్యంగా విషయం తెలిసింది. సాధారణంగా క్రికెట్ మ్యాచుల్లో వాన పడినప్పుడు ఈ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ద్వారానే రిజల్ట్​ను ప్రకటిస్తారు. ఈ పద్ధతిని డక్​వర్త్, లూయిస్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆవిష్కరించారు. దీన్ని ఐసీసీ 1997లో తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ పద్ధతి అమల్లో ఉంది. అయితే ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ ఈ పద్ధతికి కొన్ని మార్పులు చేయగా, అప్పటి నుంచి డక్​వర్త్ లూయిస్ స్టెర్న్(డీఎల్ఎస్)గా మారిపోయింది. కాగా, డక్​వర్త్​ మరణవార్త తెలుసుకుంటున్న క్రికెట్ ప్రియులు, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.