ETV Bharat / snippets

ఫైనల్​కు దూసుకెళ్లేదెవరో- ఎవరు నెగ్గినా ఫస్ట్​ టైమ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 6:02 PM IST

Afg vs Sa Semi FInal 2024
Afg vs Sa Semi FInal 2024 (Source: Associated Press)

Afg vs Sa Semi FInal: 2024 టీ20 వరల్డ్​కప్ తొలి సెమీఫైనల్​కు సమయం ఆసన్నమైంది. ఈ కీలకమైన పోరులో సౌతాఫ్రికా- అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో సౌతాఫ్రికా అజేయంగా సెమీస్​కు అర్హత సాధిస్తే, అఫ్గాన్ సంచలన విజయాలతో దూసుకువచ్చింది. కీలకమైన సెమీస్​లోనూ జోరు ప్రదర్శించి ఫైనల్​ దూసుకెళ్లాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఈ రెండింట్లో ఏ జట్టు నెగ్గినా ఫైనల్​కు చేరడం ఇదే తొలిసారి.

డికాక్, క్లాసెన్, మిల్లర్, మర్​క్రమ్, రబాడా, నోకియా సౌతాఫ్రికాకు కీలకం కానున్నారు. బ్యాటింగ్​లో డికాక్, మిల్లర్, మర్​క్రమ్​ రాణిస్తే సఫారీలకు భారీ స్కోర్ ఖాయం. రబాడ, నోకియా బౌలింగ్​లో కీలక పాత్ర పోషించనున్నారు. ఇక గుర్బాజ్, జద్రాన్, ఒమర్జాయ్, నైబ్, రషీద్, నూర్, నవీనుల్​తో అఫ్గాన్ కూడా బలంగానే ఉంది. చూడాలి మరి ఎవరు ఫైనల్​కు దూసుకెళ్తారో. ట్రినిడాడ్ పిచ్​ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉండనుంది. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.