ETV Bharat / snippets

'నేను విసిగిపోయా - ఇకపై అలాంటి పాత్రలను చేయను'

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 12:35 PM IST

Source ANI
Vijay (Source ANI)

VijaySethupati about Villian Roles : హీరోగానే కాకుండా విలన్‌గానూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విజయ్‌ సేతుపతి. అయితే తన లేటెస్ట్ మూవీ మహారాజ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్టీస్టారర్‌ చిత్రాల గురించి మాట్లాడారాయన. "ఇకపై స్టార్‌ హీరోల సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మల్టీ స్టారర్‌లు చేసి విసిగిపోయాను. కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. మరో హీరోతో కలిసి స్క్రీన్‌ షేర్ చేస్తే అందులో ఎంత బాగా నటించినా పేరు మాత్రం రాదు. మరో హీరోతో సమానంగా శ్రమించినా ఎవరూ గుర్తించరు. అందుకే విలన్‌, అతిథి పాత్రల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను. రొమాంటిక్ సినిమాలు చేయడమంటే ఇష్టం. మంచి లవ్‌ స్టోరీ కోసం వెతుకుతున్నా." అని చెప్పారు. కాగా, మహారాజ క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. నిథిలన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.