ETV Bharat / snippets

'గొప్ప వ్యక్తిని కోల్పోయాం, ఇది తీరని లోటు'

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 8, 2024, 5:11 PM IST

Chiranjeevi Tribute To Ramoji Rao
Chiranjeevi Tribute To Ramoji Rao (Source: ETV Bharat)

Chiranjeevi Tribute To Ramoji Rao: రామోజీరావు మరణం తీరనిలోటని సినీ నటుడు చిరంజీవి అన్నారు. శనివారం రామోజీ ఫిల్మ్​ సిటీలో ఆయన పార్థివదేహానికి చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.'రామోజీరావుకు పెన్నులు అంటే చాలా ఇష్టం. ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఆయనకు ఓ పెన్ను బహూకరించాను. దాన్ని చూసి ఆయన మురిసిపోయారు. ఆయన దగ్గరున్న పెన్నుల కలెక్షన్‌ నాకు చూపించారు. తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపంలో పెట్టేవారు. ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఆయన చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. రామోజీరావు మృతి ఆయన కుటుంబానికే కాదు తెలుగు జాతికి తీరని లోటు. ఒక మహావ్యక్తిని, శక్తిని కోల్పోయాం' అని చిరంజీవి అన్నారు. రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూస్తే, తాను మాత్రం ఆయనలో చిన్న పిల్లాడిని చూశానని చిరు అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.