ETV Bharat / snippets

'పుష్ప' విలన్‌ ఫహాద్​ ఫాజిల్‌పై కేసు నమోదు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 11:51 AM IST

source ETV Bharat
FahadhFaasil (source ETV Bharat)

FahadhFaasil Case Registered : ఫహాద్​ఫాజిల్‌ అంటే టక్కున గుర్తుపట్టకపోవచ్చుగానీ పుష్ప పోలీస్ విలన్‌ అంటే గుర్తుపట్టేస్తారు. పార్టీ లేదా పుష్ప అంటూ తెలుగువారిని బాగా ఆకట్టుకున్న ఆయన ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈయనపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసి, సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

ఎందుకంటే? - ఫహాద్​ పింకేలీ షూటింగ్‌ను అంగమలైలోని ఎర్నాకులం గవర్న్​మెంట్ హాస్పిటల్​లో చిత్రీకరించారు. గత గురువారం రాత్రంతా చిత్రీకరణ జరపడంతో అక్కడున్న రోగులు ఇబ్బంది పడ్డారట. ఎమర్జెన్సీ రూమ్​లోనూ చిత్రీకరించడానికి లోపలికి ఎవరినీ అనుమతించలేదట. దీంతో అత్యవసర విభాగంలో షూట్‌ కోసం ఎలా అనుమతిచ్చారని ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనాకుమారి మండిపడ్డారు. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఆ ఆరోపణలను అక్కడి నిర్మాతల సంఘం కొట్టిపారేసింది. షూటింగ్‌ కోసం రూ.10వేలు చెల్లించినట్లు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.