ETV Bharat / snippets

'ప్రభాస్ వల్లే ఇలా అయ్యాను' : దీపికా పదుకొణె ఫన్నీ కామెంట్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 9:29 AM IST

source ETV Bharat
prabhas deepika (source ETV Bharat)

Kalki 2898AD PreReleaseEvent DeepikaPadukone : ఈ ఈవెంట్​లో మొదటగా అమితాబ్​, కమల్​హాసన్​ గురించి మాట్లాడిన ప్రభాస్​ దీపికాపదుకొణె గురించి ఏమీ మాట్లాడకుండానే మైక్ పక్కనపెట్టబోయారు. దీంతో పక్కనే ఉన్న లవ్లీలేడీ గురించి చెప్పాలంటూ రానా అనగా సారీ అంటూ ప్రభాస్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే దీపిక కల్పించుకుని 'ప్రభాస్ రెండు మాటలు మాట్లాడడాన్ని మనం సెలెబ్రేట్ చేసుకోవాలి. ఇంట్రోవర్ట్‌గా ఉండే ప్రభాస్ ఈ మాత్రం మాట్లాడడమే గొప్ప' అంటూ సరదాగా అన్నారు. అప్పుడు దీపిక సూపర్​స్టార్, గొప్పనటి అని ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. అప్పుడు తన బేబీ బంప్‍ను చూపిస్తూ ప్రభాస్ తినిపించిన తిండి వల్లే ఇలా అంటూ దీపిక సరదాగా జోక్ చేసి నవ్వులు పూయించారు. ఇక ఇదే ఈవెంట్​లో ప్రెగ్నెంట్​గా ఉన్న దీపికను చేయి పట్టుకుని ప్రభాస్ నడిపించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో అమితాబ్ కూడా సరదాగా​, ప్రభాస్​ను చేయి పట్టుకుని నడిపించి నవ్వించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.