ETV Bharat / snippets

స్టేజ్​పైనే తెలుగు నిర్మాత పాదాలు తాకిన అమితాబ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 9:53 AM IST

source ANI
amitab ashwini dutt (source ANI)

Kalki 2898 AD Pre Release Event AmitabhBachan producer AshwiniDutt : కల్కి ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబయిలో గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​కు అమితాబ్​​బచ్చన్​, కమల్​హాసన్, దీపికాపదుకొణె, ప్రభాస్​తో పాటు నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు. రానా హోస్ట్​గా వ్యవహరించారు. అయితే ఈ ఈవెంట్​లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అశ్వినీదత్ పాదాలను తాకబోయారు అమితాబ్​. అశ్వినీదత్​ లాంటి నిర్మాతను తాను ఎప్పుడూ చూడలేదని, సెట్​లో తమను బాగా చూసుకున్నారని ప్రశంసలు కురిపించారు. అనంతరం అశ్వినీదత్ కూడా రియాక్టై అమితాబ్​ పాదాలను తాకబోయారు. ఈ ఆసక్తికరమైన దృశ్యం బాగా వైరల్​గా మారింది. ఇకపోతే కల్కి సినిమా అద్భుతంగా ఉంటుందని, ఇలాంటి సినిమాలో భాగమవ్వడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు అమితాబ్​. బిగ్​ టికెట్​ లాంఛ్​ చేసిన తర్వాత దానిని కొనుగోలు చేసి కమల్​హాసన్​కు గిఫ్ట్​గా ఇచ్చారు. కాగా, సినిమా జూన్​ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. ఇప్పటికే టికెట్లు హాట్​కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.