ETV Bharat / snippets

నటి శిల్పా శెట్టిపై చీటింగ్ కేసు నమోదు! : పోలీసులకు కోర్టు ఆదేశం

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 7:47 AM IST

source ANI
silpa shetty (source ANI)

Bollywood Actress Shilpa Shetty Cheating Case : బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రా సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబయి కోర్టు ఆదేశించింది. గోల్డ్ స్కీమ్​తో(బోగస్‌ బంగారం పథకం) తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదుపై ముంబయి అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఎన్‌పి మెహతా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరపాలని పేర్కొన్నారు. కాగా, శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రాలు సహా వారు స్థాపించిన సత్​యుగ్​ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, దాని ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి తనను మోసం చేశారని రిద్ధి సిద్ధి బులియన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారీ పోలీసులకు కంప్లైంట్​ చేశాడు. దీంతో వీరు మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జి కూడా ధ్రువీకరించారు. పూర్థి స్థాయిలో దర్యాప్తు చేయాలని బీకేసీ పోలీస్ స్టేషన్‌ను అదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.