ETV Bharat / snippets

షూటింగ్​లో గాయపడ్డ ప్రియాంక చోప్రా

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 12:45 PM IST

source ETV Bharat
Actor Priyanka Chopra (source ETV Bharat)

Actor Priyanka Chopra Jonas Injured : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గాయపడింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హాలీవుడ్ మూవీ ది బ్లఫ్​ షూటింగ్ సమయంలో ఆమెకు స్వల్ప గాయమైంది. దీనికి సంబంధించిన ఫొటోను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన గొంతు మీద చిన్న స్క్రాచ్​ అయినట్లు సెల్ఫీ ఫొటోను షేర్ చేసింది. స్టంట్ చేస్తుండగా ఇలా జరగినట్లు క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్​గా మారింది. దీంతో అభిమానులు ఆమెకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే షూటింగ్​లలో గాయపడటం ఆమెకు కొత్తేమి కాదు. కాగా, ది బ్లఫ్​ సినిమాను రస్సో బ్రదర్స్ బ్యానర్​ ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్​ ఎమ్​జీఎమ్​ స్టూడియోస్​ కలిసి నిర్మిస్తున్నారు. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్​ డైరెక్ట్​ చేస్తున్నారు. ప్రియాంక మాజీ పైరేట్​గా నటిస్తోంది.​ ఈ చిత్రం అమెజాన్​ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆమె చివరిగా సిటాడెల్​ వెబ్ సిరీస్​తో ప్రేక్షకుల్ని అలరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.