ETV Bharat / snippets

కాలికి దెబ్బ తగిలితే బాలుడి ప్రైవేట్ పార్ట్​కు ఆపరేషన్! ప్రభుత్వ వైద్యుల నిర్వాకం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 2:16 PM IST

Wrong Surgery in Maharashtra
Wrong Surgery in Maharashtra (ANI)

Wrong Surgery in Maharashtra : గాయపడిన కాలికి బదులుగా బాలుడి ప్రైవేట్ భాగానికి శస్త్రచికిత్స చేశారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. ఈ ఘటన మహారాష్ట్ర ఠాణె జిల్లాలో జరిగింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

జూన్ 15న తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో తమ కుమారుడు గాయపడ్డాడని మైనర్ తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. అక్కడ బాలుడి కాలికి బదులు ప్రైవేట్ భాగానికి శస్త్ర చికిత్స చేశారని ఆరోపించారు. ఆ తర్వాత మళ్లీ తమ కుమారుడిని ఆపరేషన్ థియేటర్​కు తీసుకెళ్లి కాలికి శస్త్ర చికిత్స చేశారని అన్నారు. కాగా, ఈ ఆరోపణలను ఆస్పత్రి వైద్యాధికారులు ఖండించారు. బాలుడికి ఫిమోసిస్ అనే సమస్య కూడా ఉంది అందుకే రెండు ఆపరేషన్లు చేశామని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.