ETV Bharat / snippets

సైనిక విన్యాసాలు చేస్తుండగా నదిలో మునిగిన ట్యాంకర్- ఐదుగురు జవాన్లు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 11:11 AM IST

Updated : Jun 29, 2024, 12:14 PM IST

Tank Accident Near LAC in Ladakh
Tank Accident Near LAC in Ladakh (ETV Bharat)

Tank Accident Near LAC in Ladakh : లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన యుద్ధట్యాంకు ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు. దౌలత్‌ బెగ్‌ ఓల్డీ ప్రాంతంలోని మందిర్​ మోర్హ్​ వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక జూనియర్​ కమిషన్డ్​ అధికారి(JCO)తో సహా ఐదుగురు సైనికులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

సైనిక విన్యాసాల్లో భాగంగా నది దాటుతుండగా వరదలు సంభవించాయి. ఒక్కసారిగా నదిలో నీటి ఉద్ధృతి పెరిగి టీ-72 ట్యాంక్‌ మునిగిపోయింది. దీంతో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. కాగా, ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు.
ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుందని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Last Updated : Jun 29, 2024, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.