ETV Bharat / state

గోదావరిలో యథేచ్ఛగా ఇసుక డ్రెడ్జింగ్ - పట్టించుకోని అధికారులు - Illegal Sand Mining in Rajahmundry

Sand Dredging in Godavari River in Rajamahendravaram: ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. అయినా అటువైపు ఏ ఒక్క విభాగమూ కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. డ్రెడ్జింగ్ జరుగుతున్న తీరుపై ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో పాటు వంశీ దినేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు.

Sand Dredging in Godavari River in Rajamahendravaram
Sand Dredging in Godavari River in Rajamahendravaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 12:38 PM IST

గోదావరిలో యథేచ్ఛగా ఇసుక డ్రెడ్జింగ్ - అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయని అధికార యంత్రాంగం (ETV Bharat)

Sand Dredging in Godavari River in Rajamahendravaram : ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ధవళేశ్వరం పరిధిలో బోట్స్ మెన్ సొసైటీల పేరిట అనుమతులు పొంది పదుల సంఖ్యలో డ్రెడ్జర్లు నదిలోంచి ఇసుక తెస్తుంటే యంత్రాలతో పడవల్లోని ఇసుకను లారీల్లోకి లోడ్ చేసి పంపిస్తున్నారు. అయినా అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది.

కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు- ప్రొక్లైన్లతో నదీగర్భానికి తూట్లు - Illegal Sand Mining

వైఎస్సార్సీపీ నాయకుల కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు : రాజమహేంద్రవరం గ్రామీణం కొవ్వూరు పరిధిలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గోదావరిలో 70 వరకు డ్రెడ్జర్లు తిరుగుతున్నాయి. కలెక్టరేట్, జల వనరుల శాఖ కార్యాలయానికి సమీపంలోనే వైఎస్సార్సీపీ నాయకుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. అయినా అటువైపు ఏ ఒక్క విభాగమూ కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. బోట్స్ మన్ సొసైటీల పేరిట అనుమతులు పొందిన రేవుల్లో ఆయా సభ్యులు పడవల్లో నదిలోకి వెళ్లి చేతులతో ఇసుక తవ్వి తీసుకురావాలి. కానీ గోదావరిలో నిబంధనలకు తూట్లు పొడిచి డ్రెడ్జింగ్ చేస్తున్నారు. 30 రీచ్‌లకు అనుమతులుండగా వాటిలో 70 డ్రెడ్జర్లు తిరుగుతున్నాయని అంచనా. వీటి ద్వారా రోజుకు సగటున 35 వేల టన్నుల ఇసుక తరలిస్తున్నారు. తద్వారా 2 కోట్ల రూపాయల వరకు చేతులు మారుతోంది.

నదులపై వైఎస్సార్సీపీ ఇసుక తోడేళ్లు - అభివృద్ధి పనులకు కొరత - YSRCP Leaders Illegal Sand Mining

తగిన ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశామన్న ముప్పాళ్ల సుబ్బారావు : డ్రెడ్జింగ్ జరుగుతున్న తీరుపై ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో పాటు వంశీ దినేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎస్పీ, ఇతర అధికారులకు న్యాయస్థానం సూచించింది. అయితే అధికారులు అంతా తప్పుడు నివేదికలు ఇచ్చి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. దీనిపై తాము తగిన ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు.

"జిల్లా ఎస్పీ అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని తప్పుడు నివేదిక ఇచ్చారు. ఈ రోజుటికి కూడా ధవళేశ్వరం పరిసర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులు న్యాయస్థాన తీర్పులను పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు." - ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది

ఇసుక అక్రమ తవ్వకాలు - కోడ్​ ఉన్నా ఆగని దోపిడీ - YCP LEADERS ILLEGAL SAND MINING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.